Header Banner

చిరంజీవి కొత్త చిత్రంపై అప్డేట్ ఇచ్చిన నాని.. ఈ మెగా ప్రాజెక్ట్‌ను..

  Wed Apr 23, 2025 16:28        Entertainment

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, 'దసరా' చిత్రంతో విశేష గుర్తింపు పొందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ ప్రతిష్ఠాత్మక చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు నటుడు నాని నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే, ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ నాని తాజాగా కీలక వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం నాని తన స్వీయ నిర్మాణంలో వస్తున్న 'హిట్ 3' సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధులు చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ గురించి ఆయన్ను ప్రశ్నించారు. దీనిపై నాని స్పందిస్తూ, తాను ప్రస్తుతం 'ప్యారడైజ్' అనే మరో సినిమా చేయాల్సి ఉందని, దాని చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందని నాని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: మరో నాలుగు రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్! బయటకు అసలు రావద్దు ..

 

'ప్యారడైజ్' సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి గారి ప్రాజెక్ట్ పనులు మొదలుపెడతామని నాని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ మెగా ప్రాజెక్ట్‌ను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 'దసరా'తో తనదైన మార్క్ క్రియేట్ చేసిన శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్‌ను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, టైటిల్ వంటి మరిన్ని అప్‌డేట్‌లను ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైన తర్వాత వెల్లడిస్తామని నాని ఈ సందర్భంగా తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli